Asian Games India Record: ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర.. వంద పతకాలతో సరికొత్త రికార్డు.. మహిళల కబడ్డీ ఫైనల్ లో భారత్ చేతిలో చైనీస్ జట్టు చిత్తు.. మొత్తంగా భారత్ కు ఏయే పతకాలు ఎన్ని వచ్చాయంటే?
ఏకంగా వంద పతకాలు సాధించి తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.
Newdelhi, Oct 7: ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా వంద పతకాలు (100 Medals) సాధించి తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్ (Kabaddi Finals) లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్ లో మొత్తం నాలుగు పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది. ఇదే అర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగా.. అభిషేక్ రజతం సాధించాడు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది.
పతకాల సరళి ఇలా..
భారత్ సాధించిన వంద పతకాల్లో స్వర్ణం- 25 రజతం- 35 కాంస్యం- 40 పతకాలు ఉన్నాయి. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 4 స్థానంలో కొనసాగుతోంది.