Venkatesh Iyer: బౌలర్ చింతన్ గజా త్రో.. టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

మైదానంలోకి అంబులెెన్స్, స్ట్రెచర్.. ఫిజియో ప్రథమ చికిత్సతో కోలుకున్న అయ్యర్

Venkatesh iyer (Photo Credits: Twitter)

NewDelhi, September 17:  దులీప్ ట్రోఫీలో (Duleep Trophy) సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతున్న టీమిండియా (Team India) క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెస్ట్‌జోన్-సెంట్రల్ జోన్ మధ్య నిన్న కోయంబత్తూరులో సెమీస్ రెండో రోజు ఆట కొనసాగింది. ఈ క్రమంలో వెస్ట్‌జోన్ బౌలర్ చింతన్ గజా ఓవర్‌లో 27 ఏళ్ల వెంకటేష్ అయ్యర్ సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి బంతి చింతన్ వద్దకు వెళ్లడంతో అతడు వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా వెంకటేష్ మెడను (Neck) బలంగా తాకింది. అంతే, అయ్యర్ అక్కడే బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలాడు.

టెన్నిస్ దిగ్గజం సంచలన నిర్ణయం, రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్, అతని కెరీర్‌లో ఎన్నోరికార్డులు, ఏకంగా 310 వారాల పాటూ నెంబర్‌ వన్ స్థానం సొంతం, 20 గ్రాండ్‌ స్లామ్ టైటిల్స్ విజేత

వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజయో అతడిని పరీక్షించాడు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా మైదానంలోకి అంబులెన్స్, స్ట్రెచర్ కూడా తెప్పించారు. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మైదానం వీడిన అయ్యర్.. నొప్పి నుంచి కాస్తంత ఉపశమనం లభించిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.