Asia Cup 2022: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమి అనంతరం శ్రీలంక జెండాను ప్రదర్శించిన గౌతమ్ గంభీర్

ఫైనల్లో పాకిస్థాన్ పై 23 పరుగుల తేడాతో విజయం.. అంచనాల్లేకుండా వచ్చి ఆసియా కప్ సాధించిన వైనం.. లంక ప్రదర్శన పట్ల గంభీర్ ఫిదా

Dubai, September 12: దుబాయ్ (Dubai)లో నిన్న జరిగిన ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. సిసలైన ఆటతీరు ప్రదర్శించిన శ్రీలంక (Srilanka) చాంపియన్ గా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ బరిలో దిగిన లంకేయులు తమ పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆసియా కప్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా ఫైనల్లో శ్రీలంక జట్టు ప్రదర్శన పట్ల ముగ్ధుడయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం గంభీర్ బౌండరీ లైన్ వద్ద శ్రీలంక జాతీయ పతాకాన్ని చేతబూని లంక అభిమానుల ముందు ప్రదర్శించాడు.

పాకిస్థాన్ ను చిత్తు చేసిన శ్రీలంక, ఆసియా కప్ ఆరోసారి లంక కైవసం, ఫైనల్ పోరులో చేతులెత్తేసిన పాకిస్థాన్..

గంభీర్ తమ జెండాను ప్రదర్శించడం చూసి లంక అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. ఈ దృశ్యాలను లంకేయులు తమ ఫోన్లలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. శ్రీలంక జట్టును సూపర్ స్టార్ టీమ్ (Super Star Team) అని అభివర్ణించాడు. ఆసియా కప్ విజేతగా వారు అన్ని విధాలా అర్హులని కొనియాడాడు. లంక జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.