Year Ender 2024 a Look at Some Biggest Upsets in Cricket This Year(X)

Hyd, Dec 12: ప్రపంచంలో క్రికెట్‌కు ఉండే ఆదరణ ఇంత కాదు. కోట్లాది మంది క్రికెట్‌ను ఇప్పటికీ వీక్షిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే అంతే. టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఇక ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే

ICC T20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్‌ను అమెరికా ఓడించడం సంచలనం. ఇది ప్రపంచ క్రికెట్ అభిమానులను అబ్బుర పర్చింది. జూన్ 6న T20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్‌ను అమెరికా ఓడించడం ఎవరూ ఉహించి ఉండరు. విజయం కోసం 160 పరుగుల లక్ష్యాన్ని చేధించిన USA చివరి బంతికి ఫోర్ కొట్టి సూపర్ ఓవర్‌కి తీసుకెళ్లగలిగింది. సూపర్ ఓవర్‌లో USA మొదట బ్యాటింగ్ చేసి 18/1 స్కోర్ చేసి విజయం సాధించింది.

T20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ కూడా అసాధారణ ఆటతీరును కనబర్చింది. సూపర్ 8లో రహ్మానుల్లా గుర్బాజ్ 60 పరుగులతో ఆస్ట్రేలియాపై 148/6 స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత ఆఫ్ఘన్ బౌలర్లు చిరస్మరణీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 127 పరుగులకే ఆలౌట్ చేశారు. గుల్బాదిన్ నైబ్ నాలుగు వికెట్లు పడగొట్టారు. నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. పాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్, కరీం జనత్ ,గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించారు.

USA జాతీయ క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1తో ఓడించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను 84 పరుగుల తేడాతో ఓడించింది ఆఫ్ఘనిస్తాన్ . రహ్మానుల్లా గుర్బాజ్ 56 బంతుల్లో 80 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యచేధనలో న్యూజిలాండ్‌ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది.  ఆడిలైడ్ టెస్టులో భారత్ పరాజయం, 10 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్...1-1తో సిరీస్ సమం 

UAEలో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాతో తలపడింది. దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి సిరీస్‌లో గెలుపొందింది ఆఫ్ఘానిస్తాన్. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు 207 పరుగులకే ఆలౌటైంది. యువ పేసర్ షామర్ జోసెఫ్ 68 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇలా ఈ సంవత్సరం ఎన్నో చిరస్మరణీయ, సంచలన విజయాలు నయోదయ్యాయి.