Spin Legend R Ashwin: అశ్విన్‌ కు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వండి.. కేంద్రానికి కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ వసంత్‌ అభ్యర్ధన

అంతర్జాతీయ క్రికెట్‌ కు ఇటీవల వీడ్కోలు పలికిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ వసంత్‌ కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్‌ సుక్‌ మాండవీయకు రిక్వెస్ట్ చేశారు.

Ravichandran Ashwin in Action (Photo Credits: @BCCI/X)

Hyderabad, Dec 21: అంతర్జాతీయ క్రికెట్‌ కు ఇటీవల వీడ్కోలు పలికిన భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Spin Legend R Ashwin) కు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు (Khel Ratna Award) ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌ వసంత్‌ కేంద్ర యువజన క్రీడల మంత్రి మన్‌ సుక్‌ మాండవీయకు రిక్వెస్ట్ చేశారు. భారత క్రికెట్‌ కు అశ్విన్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. ‘అశ్విన్‌ కు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు ఇవ్వాలని క్రీడల మంత్రి మన్‌ సుక్‌ మాండవీయను కోరాను. భారత క్రికెట్‌ కు అశ్విన్‌ అందించిన సేవలకు అమూల్యమైనవి. ఆయన ఖేల్‌ రత్న అవార్డుకు అర్హుడు’ అని ఎంపీ విజయ్‌ వసంత్‌ పేర్కొన్నారు.

అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్‌ (వీడియో)

Here's Video:

106 టెస్ట్ మ్యాచ్‌ ల్లో 537 వికెట్లు

అశ్విన్‌ తన కెరీర్‌ లో 106 టెస్ట్ మ్యాచ్‌ లు ఆడి 537 వికెట్లు తీశాడు. అందులో 37 సార్లు ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టాడు. అదేవిధంగా బ్యాటింగ్‌ లోనూ తనవంతు పాత్ర పోషించాడు. మొత్తం 3,503 పరుగులు చేశాడు.

టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif