Newdelhi, Dec 20: భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ (Ashwin) అనూహ్య రిటైర్మెంట్ అంశంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికాడు అశ్విన్. అశ్విన్ రిటైర్మెంట్ పై ఆయన తండ్రి రవిచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవమానాల వల్లే (Humiliation) అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ‘అశ్విన్..వీడ్కోలు పలుకుతున్న విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది అతని రిటైర్మెంట్ వెనుక చాలా కారణాలు ఉండే ఉంటాయి. అవమానాలు వల్లే అతను ఈ నిర్ణయానికి వచ్చి ఉండచ్చు. ఎవరైనా ఎన్ని రోజులు అవమానాలు ఎదుర్కొంటారు’ అని ప్రశ్నించారు.
టీమిండియా జైత్రయాత్ర, వెస్టిండిస్ పై ఘన విజయం, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న మహిళా జట్టు
Here's Video:
“Humiliation was going on, how much he can tolerate?”
Ashwin's father taking dig at coach Gautam Gambhir pic.twitter.com/cgF4qufY2d
— ' (@dhoniverse_) December 19, 2024
పట్టించుకోవద్దు
రవిచంద్రన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అశ్విన్ దిద్దుబాటు చర్యలకు దిగాడు. ‘నా తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియదు. అతని మాటాలను మీరు సీరియస్ గా తీసుకోకండి. జరిగిన తప్పిదాన్ని మన్నించి అతన్ని ఒంటరిగా వదిలేయండి’ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చాడు.