Pakistan Semis Scenario: పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం! ఇలా జరిగితేనే పాక్‌కు సెమీస్ అవకాశాలు, ఆఫ్ఘనిస్తాన్ మీదనే పాక్ భవిష్యత్తు
ఈ రెండు జట్లు అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (Ausis) కూడా ఆరు మ్యాచ్‌లలో (ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ కాకుండా) నాలుగు గెలిచి మూడో స్థానంలో ఉంది.
Bangalore, NOV 04: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌పై 21 పరుగుల (DLS) తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో పాక్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాక్ విజయం ఆ జట్టును పాయింట్ల పట్టికలో ఐదో స్థానానాకి చేర్చడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది. మరి పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఈ విజయం సరిపోతుందా..? ఇంకా ఏం చేయాలి..?ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా సౌతాఫ్రికా (South Africa) రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (Ausis) కూడా ఆరు మ్యాచ్‌లలో (ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ కాకుండా) నాలుగు గెలిచి మూడో స్థానంలో ఉంది. ఎటొచ్చి నాలుగో స్థానంతోనే అసలు సమస్య. కివీస్ 8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి నాలుగింటిలో ఓడింది. పాకిస్తాన్ కూడా 8 ఆడి నాలుగు గెలిచి నాలుగు ఓడింది. కానీ న్యూజిలాండ్ (New Zealand) నెట్ రన్ రేట్ (+0.0398).. పాకిస్తాన్ (+0.036) కంటే మెరుగ్గా ఉంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో పాటు పాకిస్తాన్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. పాకిస్తాన్ తమ తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉండగా కివీస్.. శ్రీలంకతో తలపడనుంది.
పాకిస్తాన్ (Pakistan) సెమీ ఫైనల్స్ చేరాలంటే ఆ జట్టు విజయంతో పాటు ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంది. లంక గనక కివీస్‌ను ఓడించడమో లేక వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే అది పాకిస్తాన్ నెత్తిమీద పాలు పోసినట్టే. లంక విజయంతో పాటు పాకిస్తాన్ తమ తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాలి. అఫ్గానిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల చేతిలో ఓడిపోవాలి.
ఒకవేళ న్యూజిలాండ్.. లంకపై 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిస్తే అప్పుడు పాకిస్తాన్.. ఇంగ్లండ్‌ను 180 పరుగుల తేడాతో ఓడించాలి. అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఓడి.. పాకిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడిస్తేనే బాబర్ గ్యాంగ్ సెమీస్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే పాక్ భవితవ్యం ప్రస్తుతానికి లంక చేతిలో ఉంది. మరి లంకేయులు పాకిస్తాన్‌ను ఆదుకుంటారో లేక తమతో పాటు బంగాళఖాతంలో ముంచుతారో తెలియాలంటే ఈనెల 9 వరకూ ఆగాల్సిందే. అదే తేదీన పాక్-కివీస్ మ్యాచ్ జరిగిన బెంగళూరు వేదికగానే శ్రీలంక.. న్యూజిలాండ్‌ను ఢీకొననుంది.