IPL 2022: కుల్దీప్‌ దెబ్బకు 5వ ఓటమిని మూటగట్టుకున్న మాజీ చాంపియన్‌, వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/14) ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలతో చెలరేగాడు.గురువారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపొందింది.

Kuldeep Yadav (Photo credit: Twitter)

ప్రత్యర్థి స్పిన్, పేస్‌ ధాటికి మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ తడబడింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/14) ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలతో చెలరేగాడు.గురువారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (34 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (42) రాణించాడు. కోల్‌కతా బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/14), ముస్తఫిజుర్‌ రెహమాన్‌ (3/18) ధాటికి.. ఆరోన్‌ ఫించ్‌ (3), వెంకటేశ్‌ అయ్యర్‌ (6), బాబా ఇంద్రజిత్‌ (6), నరైన్‌ (0), రస్సెల్‌ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే పృథ్వీ షా (0) గోల్డెన్‌ డకౌటైనా.. డేవిడ్‌ వార్నర్‌ (26 బంతుల్లో 42; 8 ఫోర్లు), రావ్‌మన్‌ పావెల్‌ (16 బంతుల్లో 33 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్‌తో లక్నో తలపడనుంది.

ఏం బౌలింగ్ వేస్తున్నావ్, మైండ్ దొబ్బిందా.. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ కోచ్‌ మురళీధరన్‌, సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్కోరు వివరాలు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: ఫించ్‌ (బి) సకారియా 3; వెంకటేశ్‌ (సి) సకారియా (బి) అక్షర్‌ 6; అయ్యర్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 42; బాబా ఇంద్రజిత్‌ (సి) పావెల్‌ (బి) కుల్దీప్‌ 6; నరైన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 0; నితీశ్‌ రాణా (సి) సకారియా (బి) ముస్తఫిజుర్‌ 57; రసెల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 0; రింకూ సింగ్‌ (సి) పావెల్‌ (బి) ముస్తఫిజుర్‌ 23; ఉమేశ్‌ (నాటౌట్‌) 0; సౌతీ (బి) ముస్తఫిజుర్‌ 0; హర్షిత్‌ రాణా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–4, 2–22, 3–35, 4–35, 5–83, 6–83, 7–145, 8–146, 9–146. బౌలింగ్‌: ముస్తఫిజుర్‌ 4–0–18–3; సకారియా 3–0–17–1, శార్దుల్‌ 3–0–32–0, అక్షర్‌ 4–0–28–1, కుల్దీప్‌ 3–0–14–4, లలిత్‌ 3–0–32–0.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి అండ్‌ బి) ఉమేశ్‌ 0; వార్నర్‌ (సి) నరైన్‌ (బి) ఉమేశ్‌ 42; మార్‌‡్ష (సి) వెంకటేశ్‌ (బి) హర్షిత్‌ 13; లలిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్‌ 22; పంత్‌ (సి) ఇంద్రజిత్‌ (బి) ఉమేశ్‌ 2; పావెల్‌ (నాటౌట్‌) 33; అక్షర్‌ (రనౌట్‌) 24; శార్దుల్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 150.

వికెట్ల పతనం: 1–0, 2–17, 3–82, 4–84, 5–84, 6–113.

బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4–0–24–3, హర్షిత్‌ రాణా 3–0–24–1, సౌతీ 4–0–31–0, నరైన్‌ 4–0–19–1, నితీశ్‌ రాణా 1–0–14–0, రసెల్‌ 1–0–14–0, వెంకటేశ్‌ 1–0–14–0, శ్రేయస్‌ అయ్యర్‌ 1–0–7–0.

ఐపీఎల్‌లో నేడు

పంజాబ్‌ కింగ్స్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌ వేదిక: పుణే



సంబంధిత వార్తలు