RCB's New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా? కోహ్లీ స్థానంలో కెప్టెన్ గా డుప్లిసెస్, సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ కు దక్కిన కెప్టెన్సీ పగ్గాలు

ఆర్సీబీ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేడయంతో అతడి స్థానంలో ఎవరూ ఆర్సీబీ కెప్టెన్‌గా వస్తారనేది సస్పెన్స్ నడిచింది. కోహ్లీ తర్వాత కెప్టెన్ రేసులో కొందరి పేర్లు వినిపించాయి. అయినప్పటికీ ఆర్జీబీ ప్రాంఛైజీ రివీల్ చేయలేదు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ కోహ్లీ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది.

Bangalore, March 12: ఐపీఎల్ 2022 సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. మార్చి 26న నుంచి ముంబైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) మధ్య తొలి మ్యాచ్ జరుగనంది. ఈ సీజన్‌లో పాల్గొనే 10 ఐపీఎల్ జట్లలో చాలావరకూ జట్లు తమ కెప్టెన్ ఎవరో ప్రకటించేశాయి. కానీ, ఒక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మాత్రం తమ జట్టు కెప్టెన్ ఎవరూ అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆర్సీబీ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేడయంతో అతడి స్థానంలో ఎవరూ ఆర్సీబీ కెప్టెన్‌గా వస్తారనేది సస్పెన్స్ నడిచింది. కోహ్లీ తర్వాత కెప్టెన్ రేసులో కొందరి పేర్లు వినిపించాయి. అయినప్పటికీ ఆర్జీబీ ప్రాంఛైజీ రివీల్ చేయలేదు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ కోహ్లీ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. అతడు ఎవరో కాదు.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis).. ఇతగాడే తదుపరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మార్చి 26 నుంచి ముంబైలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే ఎడిషన్‌లో RCB జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. శనివారం (మార్చి 12) బెంగళూరులో జరిగిన ‘‘RCB Unbox’ కార్యక్రమంలో డుప్లెసిస్ (du Plessis) పేరును ప్రకటించారు. గత ఏడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్‌ను గత నెలలో జరిగిన మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా గత ఏడాది విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.

అప్పటినుంచి RCB ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. T20 ప్రపంచ కప్‌కు ముందు భారత T20I కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు విరాట్ ప్రకటించిన కొద్ది రోజులకే కొత్త కెప్టెన్ ఎవరు అనేది సస్పెన్స్‌గా మారింది. ఎట్టకేలకు RCB ప్రాంచైజీ తమ జట్టు కెప్టెన్ ఎవరో ప్రకటించింది. కోహ్లీ స్థానంలో డుప్లెసిస్ కెప్టెన్ గా ఎంపిక చేసినట్టు ప్రకటించింది. 2011 నుండి కోహ్లీ RCB జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 2016 సంవత్సరంలో కోహ్లీ సారథ్యంలో జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. అదే ఏడాది ఐపీఎల్ టోర్నీలో RCB రన్నరప్‌గా నిలిచింది.

ఆర్‌సీబీకి డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించడంపై విరాట్ కోహ్లీ (Virat kohli) స్పందించాడు. ‘బ్యాటన్‌ను ఫా డుప్లెసిస్‌కు అందించడం సంతోషంగా ఉంది. అతడి నాయకత్వంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా.. ఇది మా కొత్త కెప్టెన్‌కు నా నుంచి సందేశం’’ అని వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

IPL 2022లో ఇకపై డుప్లెసిస్ సారథ్యంలో RCB జట్టు మార్చి 27న ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. డుప్లెసెస్ తన కెరీర్‌లో 115 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్సీగా వ్యహరించాడు. అతడి నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు 81 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రోటీస్ జట్టు ఆడిన 40 T20I మ్యాచ్‌ల్లో 25 మ్యాచ్‌లు గెలిచింది. ఫిబ్రవరి 2020లో డుప్లెసెస్ తన ఆటపై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. గత సీజన్లలో CSK తరపున ఆడిన రైట్ హ్యాండ్ బ్యాటర్ డుప్లెసెస్.. ఆ జట్టులో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లోనూ డుప్లెసిస్ 633 పరుగులతో రాణించాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ విజేత రుతురాజ్ గైక్వాడ్ కన్నా కేవలం రెండు పరుగుల దూరంలోనే డుప్లెసెస్ నిలిచాడు. అలాగే, IPL 2020 2021లో కలిపి 1000 కంటే ఎక్కువ పరుగులను డుప్లెసెస్ తన పేరిట నమోదు చేశాడు.

Sreesanth Announces Retirement : రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్, రానున్న తరాల కోసమే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ మెంట్, భావోద్వేగానికి లోనైన శ్రీశాంత్

RCB జట్టు ఇలా ఉంది... విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, మహిపాల్ లోమ్రోర్, షెర్ఫా అలెన్‌ఫర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సుయాష్ ప్రభుదేసాయి, చామా మిలింద్, అనీశ్వర్ గౌతమ్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, లువ్నిత్ సిసోడియా, సిద్ధార్థ్ కౌల్.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now