Kochi, March 09: టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ జనరేషన్ కోసం కెరీర్ ను (Retirement) ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. అన్ని రకాల పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటన చేశాడు. తర్వాతి తరం క్రికెటర్ల కోసం తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ను (Indian Domestic Cricket) ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు సంతోషం కలిగించే విషయం కాదని తెలిసినప్పటికీ.. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానన్నారు. ప్రతి క్షణాన్ని ఎంతో ఆదరించడం జరుగుతోందన్నారు శ్రీశాంత్ (sreeshanth). టీమిండియా తరపున శ్రీశాంత్ 2011లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ (Ranji Trophy) ద్వారా పునరాగమనం చేశాడు. ఆ మ్యాచ్ లో ఒక వికెట్ తీశాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి వికెట్ తీసిన శ్రీశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. 39 ఏళ్ల వయస్సున్న ఇతను 2005 నుంచి 2013 వరకు టీమ్ ఇండియా తరపున 53 వన్డే ఇంటర్నేషనల్స్, 10 T- 20లు ఆడాడు.
S Sreesanth announces retirement from Indian domestic (first-class & all formats) cricket.
Tweets, "For the next generation of cricketers...I have chosen to end my first-class cricket career..."
(File photo) pic.twitter.com/DzosYaIfNN
— ANI (@ANI) March 9, 2022
శ్రీశాంత్ పై అప్పట్లో తీవ్ర ఆరోపణలు రావడం సంచలనం సృష్టించాయి. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తో శ్రీశాంత్ జీవితకాలం పాటు నిషేధానికి గురయ్యాడు. దీంతో అతడిపై బీసీసీఐ జీవితకాలం పాటు నిషేధం విధించింది. దీనిపై సవాల్ చేస్తూ.. న్యాయ పోరాటం చేశాడు శ్రీశాంత్. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శిక్ష కాలాన్ని తగ్గించాలని బీసీసీఐ ఆదేశించింది.
దీంతో అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. దీంతో 2020, 13 సెప్టెంబర్ నుంచి అతడిపై నిషేధం ఎత్తివేసింది. అనంతరం రంజీ ట్రోఫిలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతిధ్యం వహించాడు.కానీ ఇప్పుడు తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.