వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచు జరుగుతోంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఊహించని రీతిలో ఔటయ్యాడు. బాల్ వేగాన్ని అంచనా వేయకుండా బ్యాట్‌ను ఆయన పైకి లేపగా, ఆ బాల్ బ్యాట్ కింది నుంచి వెళ్లి వికెట్లకు తగిలింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో కీమర్ రోచ్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో ఈ విధంగా రూట్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతకు ముందు కూడా ఓ సారి రూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ కొద్ది సేపటికే కీమర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలిరోజు 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 268 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో సెంచరీ బాదాడు. ఇక బెన్ ఫోక్స్ 42 పరుగులు, అలెక్స్ లెస్ 4, క్రాలే 8, జో రూట్ 13, డాన్ లారెన్స్ 20, స్టోక్స్ 36 పరుగులు చేశారు.
Kemar Roach Clean Bowled England Captain Joe Root on just 13 runs.#WIvENG pic.twitter.com/bIk92mjA3X
— Over Thinker Lawyer 🇵🇰 (@Muja_kyu_Nikala) March 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)