Virat Kohli Instagram Story: ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా అంటూ కోహ్లీ బావోద్వేగ ట్వీట్ వైరల్, పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదేనని తెలిపిన విరాట్

పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా.

virat-kohli-1

బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గతంలో చెప్పిన మాటలను టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా. కీర్తిప్రతిష్టలు పెద్ద విషయమేం కాదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నామా లేదా? ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం’’.. బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలను తాజాగా కోహ్లీ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌, ఇక ముందు నా భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తాడని భావోద్వేగం

అంతేకాదు.. ‘‘ఈ కఠిన సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా? నీ పని అయిపోయిందనిపిస్తోందా? పరిస్థితులపై కోపం వస్తోందా? ఇలాంటి గడ్డు పరిస్థితులూ కాలంతో పాటే మారిపోతాయి. నీకెదురైన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీకే కాదు నిన్ను విమర్శించిన వాళ్లకూ నువ్వు జవాబు చెప్పినట్లే అవుతుంది’’ అని హాలీవుడ్‌ యాక్టర్‌ టామ్‌ హాంక్స్‌ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావించడం విశేషం.

Virat Kohli Instagram Story

కాగా వన్డే సిరీస్‌కు ముందు కోహ్లి ఈ మేరకు పోస్ట్‌ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లి పోస్ట్‌ వెనుక అర్థం ఏమిటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.