సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు సైతం ధ్రువీకరించింది. క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా. ప్రొటిస్‌కు ఆడాలనే ఆశయంతో వచ్చిన వాడిని. ఇక్కడిదాకా ఎలా రాగలిగానో నాకే తెలియదు. అయితే, దేవుడిచ్చిన ప్రతిభాపాటవాలు, ఆట పట్ల నిబద్ధత చూపగల లక్షణం నేను విజయవంతమయ్యేలా చేశాయి. ఇక ముందు కూడా నా భవిష్యత్తు ఆయనే నిర్ణయిస్తాడు’’ అంటూ తన రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా ప్రిటోరియస్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)