Venkatesh Prasad: భారత క్రికెట్ పరిస్థితి చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్
గడిచిన రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేశాడు.
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేశాడు.
రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో ఇతనే లీడింగ్ వికెట్‌టేకర్.
Tweet Here
ఓవరాల్‌గా జలజ్ తన దేశవాలీ కెరీర్‌లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు.