Asia Cup Details: అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఆసియా కప్ కు తేదీల ఖరారు... ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ మధ్య వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ వేదికపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆ అనిశ్చితికి ఎట్టకేలకు తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది.
Newdelhi, June 16: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ (Asia Cup) వేదికపై (Host) అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) ఆ అనిశ్చితికి ఎట్టకేలకు తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది. ఇక టోర్నీ తేదీలు కూడా ఖరారయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రాంతీయ టోర్నీ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. సెప్టెంబరు 17న జరిగే ఫైనల్ తో ఆసియా కప్ టోర్నీ ముగుస్తుంది. కాగా, ఈ 16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో భాగంగా 13 వన్డే మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
#AsiaCup2023 to be played in #Pakistan and #SriLanka as ACC accepts hybrid model
Arch-rivals India and Pakistan will resume their epic rivalry in the forthcoming edition of the Asia Cup which will take place from 31st August to 17th September.https://t.co/HAc6Zw4hJS
— Abhinav (@Abhinav_aj1) June 16, 2023
జట్లు ఇలా..
టోర్నీ తొలి దశలో మొత్తం 6 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. భారత్, పాకిస్థాన్, నేపాల్ ఒక గ్రూపులో ఉండగా.... శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మరో గ్రూపులో ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Jun 16, 2023 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

