Kapil Dev: మన ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యం, అందుకే టీ20 ప్రపంచకప్ ఓటమి, తీవ్ర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్, ఐపీఎల్ ప్రాంచైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టవద్దని కోరిన మాజీ కెప్టెన్
టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై (Former India captain Kapil Dev slams players) క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై (Former India captain Kapil Dev slams players) క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం కంటే వీరికి డబ్బే ప్రధానమైపోయిందని ('prioritising IPL over playing for country) మండిపడ్డారు. బాగా డబ్బు సంపాదించి పెట్టే ఐపీఎల్ వీరికి ముఖ్యమైందని అన్నారు. టీ20 ప్రపంచకప్ లో భారత్ కనీసం సెమీస్ కు చేరకుండానే ( India's exit from T20 World Cup) నిష్క్రమించడం చాలా భాదాకరం అని క్రికెట్ దిగ్గజం ఆవేదక వ్యక్తం చేశారు.
కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కే ఎక్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే టీమిండియా పరిస్థితి ఇలా తయారయిందని తెలిపారు. దేశం కంటే కూడా ఐపీఎల్ కే ఆటగాళ్లు ప్రాధాన్యతను ఇస్తే... వారిని ఏమనాలని ప్రశ్నించారు. దేశం కోసం ఆడటాన్ని ప్రతి ఆటగాడు గర్వంగా భావించాలని చెప్పారు. ఆటగాళ్లకు జాతీయ జట్టే ప్రధానంగా ఉండాలని... ఆ తర్వాతే ఐపీఎల్ ప్రాంఛైజీలని అన్నారు. ఐపీఎల్ ఆడవద్దని తాను చెప్పడం లేదని... అయితే, భవిష్యత్తులో షెడ్యూల్ ను రూపొందించే క్రమంలో బీసీసీఐ మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ప్రపంచకప్ లో ఓటమి మనకు ఒక గుణపాఠం కావాలని... మళ్లీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టకుని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయాలని సూచించారు. ఐపీఎల్ 2021 మలి దశ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేదని, ఐపీఎల్ ప్రాంచైజీల కోసం భారత క్రికెట్ ను పణంగా పెట్టవద్దని కోరారు. కాగా 2012 తర్వాత సెమీస్ చేరకుండా భారత్ ఇంటికి రావడం ఇదే తొలిసారి. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ లో నమీబియాతో భారత్ తలపడుతోంది. గ్రూప్ 2 నుంచి ఇప్పటికే పాకిస్తాన్, న్యూజీలాండ్ సెమీస్ చేరాయి.
ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. ప్రపంచకప్‌లలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇది ఒకటని చోప్రా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీ టాస్ ఓడిన మాట నిజమేనన్న అతను.. కేవలం టాస్ ఓడితేనే మ్యాచ్‌లు ఓడిపోతారా? అని ప్రశ్నించాడు.
షార్జాలో ఇంగ్లండ్‌పై టాస్ ఓడినా కూడా సౌతాఫ్రికా గెలవలేదా? అన్నాడు. ఓడిన రెండు మ్యాచుల్లో మంచు కారణంగా భారత బౌలర్లు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని, కానీ ఆ మ్యాచుల్లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడమే అసలు సమస్య అని చెప్పాడు. బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేసి ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి ఉండేదని తెలిపాడు. ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన చోప్రా.. ఇది కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనక టోర్నీగా అభివర్ణించాడు. 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత ఒకటి రెండు సార్లు టీమిండియా సెమీస్ వరకూ వెళ్లలేదని, కానీ గడిచిన 7-8 సంవత్సరాల్లో ఎప్పుడూ అలా జరగలేదని గుర్తుచేశాడు. అలాంటిది ఇప్పుడు సెమీస్ చేరకుండా వెనుతిరగడం టీమిండియా జట్టును చాలా బాధిస్తుందని పేర్కొన్నాడు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)