Glenn Maxwell (Photo-X)

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు పోరాట యోధుడు.

లైఫ్‌లైన్‌ ఇచ్చిన మ్యాక్స్‌వెల్‌.. ఆఫ్ఘన్‌ బౌలర్లపై దారుణంగా దాడి చేశాడు. అతను టోర్నమెంట్‌లో రెండవ వందను కొట్టి రికార్డు పుస్తకాల్లోకి ప్రవేశించాడు.వాంఖడే స్టేడియంలో 100 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.డేంజరస్ ఆటగాడు అని ఎందుకంటారో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి ప్రూవ్ చేశాడు.

గాయాన్ని లెక్క చేయకుండా డబుల్ సెంచరీతో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం, ఆప్ఘనిస్తాన్‌పై ఘన విజయంతో సెమీస్ లోకి దూసుకెళ్లిన కంగారూలు

వికెట్లు కోల్పోయి, తన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతగాడు.. ఒంటిచేత్తో పోరాడి తన జట్టుకి ఘనవిజయం అందించాడు. తానొక్కడే 128 బంతుల్లో 201 (నాటౌట్) పరుగులు చేశాడంటే.. ఏ రేంజ్‌లో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. కాలికి గాయమైనా, పరుగులు పెట్టలేని స్థితిలో ఉన్నా, జట్టు కష్టాల్లో ఉన్నా.. ఒత్తిడికి గురవ్వకుండా ఈజీగా బౌండరీలు బాదేశాడు. ఆఫ్ఘన్‌కు సునాయాసంగా దక్కాల్సిన విజయాన్ని అతడు లాగేసుకున్నాడు.

వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. ఆప్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జాద్రాన్ (129 నాటౌట్) శతకంతో రాణించడం, చివర్లో రషీద్ ఖాన్ (35) మెరుపులు మెరిపించడం, ఇతర బ్యాటర్లు కాస్త పర్వాలేదనిపించడంతో.. ఆఫ్ఘన్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి అఖండ విజయాన్ని నమోదు చేసింది.

ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరఫున తొలి శతకం నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇబ్రహీం జద్రాన్‌, 2015 నుంచి నో సెంచరీ

91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో మ్యాక్స్‌వెల్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు. అతడ్ని ఔట్ చేసేందుకు ఆఫ్ఘన్ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా సరే.. ప్రయోజనం లేకుండా పోయింది. క్లిష్టమైన బంతుల్ని సైతం అతడు తనకు అనుకూలంగా మార్చుకొని, తన విశ్వరూపం చూపించాడు. నిజానికి.. మ్యాక్స్‌వెల్ మొదట్లోనే ఔట్ అవ్వాల్సింది.

అతడు రెండు క్యాచ్‌లు ఇచ్చాడు. కానీ.. ఆఫ్ఘన్ ఫీల్డర్లు ఆ క్యాచ్‌లను అందుకోలేకపోయారు. అదే అఫ్ఘన్ పాలిట శాపమైంది. మ్యాక్స్‌వెల్‌కి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు.దీంతో పాటుగా 200 చేసిన అతికొద్ది మంది జాబితాలోనూ అతడు చేరిపోయాడు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆఫ్ఘన్ టాప్-4లో చేరేది. ఇప్పుడు సెమీస్ ఆశలు కష్టతరంగా మారాయి.



సంబంధిత వార్తలు

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి