వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు పోరాట యోధుడు. లైఫ్‌లైన్‌ ఇచ్చిన మ్యాక్స్‌వెల్‌.. ఆఫ్ఘన్‌ బౌలర్లపై దారుణంగా దాడి చేశాడు. అతను టోర్నమెంట్‌లో రెండవ వందను కొట్టి రికార్డు పుస్తకాల్లోకి ప్రవేశించాడు.వాంఖడే స్టేడియంలో 100 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Glenn Maxwell (Photo-X)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)