వన్డే ప్రపంచకప్‌ 2023లో సంచలన విజయాలు నమోదుచేస్తున్న అఫ్గానిస్తాన్‌.. తాజాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదుచేసింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు చేసింది. తమ క్రికెట్‌ చరిత్రలో మూడో వన్డే ప్రపంచకప్‌కు ఆడుతున్న అఫ్గాన్‌కు ఈ మెగా టోర్నీలలో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు అఫ్గాన్‌.. గత ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 288 పరుగులు చేసింది. వన్డేలలో అఫ్గాన్‌ హయ్యస్ట్‌ స్కోరు 338గా ఉంది. ఐర్లాండ్‌పై 2017లో ఆ జట్టు ఈ ఘనత సాధించింది

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)