భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.2015 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ తరఫున ఇంతవరకూ (ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు) ఒక్క బ్యాటర్‌ కూడా సెంచరీ నమోదు చేయలేదు. తాజాగా జద్రాన్‌ ఆ కొరత తీర్చి చరిత్ర పుస్తకాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జద్రాన్‌.. కంగారూల పేస్‌ త్రయం కమిన్స్‌, స్టార్క్‌, హెజిల్‌వుడ్‌లతో పాటు స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 62 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన జద్రాన్‌.. 131 బంతుల్లో మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు.

Ibrahim Zadran (photo-X)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)