Himachal Cricketer Dies: అనారోగ్యంతో భారత క్రికెటర్ మృతి, 28 ఏళ్లకే అనారోగ్యంతో కన్నుమూసిన సిద్ధార్ధ్ శర్మ, షాక్‌ లో అభిమానులు

అనారోగ్యంతో ఫాస్ట్ బౌల‌ర్ సిద్ధార్థ్ శ‌ర్మ గురువారం రాత్రి 9 గంట‌ల‌కు మ‌ర‌ణించాడు. రంజీ ట్రోఫీ కోసం గుజ‌రాత్‌లో జ‌ట్టుతో ఉన్న అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో, వ‌డోద‌ర‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలుగా వైద్యులు అత‌డికి వెంటిలేట‌ర్ మీద చికిత్స అందించారు. అయినా కూడా అత‌ని శ‌రీరం స్పదించ‌లేదు.

cricketer Siddharth Sharma dies (PIC @ Google)

Vadodara, JAN 13: హిమాచ‌ల్ ప్రదేశ్ క్రికెట్‌లో (Himachal cricketer) విషాదం నిండింది. అనారోగ్యంతో  ఫాస్ట్ బౌల‌ర్ సిద్ధార్థ్ శ‌ర్మ (Siddharth Sharma) గురువారం రాత్రి 9 గంట‌ల‌కు మ‌ర‌ణించాడు. రంజీ ట్రోఫీ కోసం గుజ‌రాత్‌లో జ‌ట్టుతో ఉన్న అతను అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో, వ‌డోద‌ర‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండు వారాలుగా వైద్యులు అత‌డికి వెంటిలేట‌ర్ మీద చికిత్స అందించారు. అయినా కూడా అత‌ని శ‌రీరం స్పదించ‌లేదు. సిద్ధార్థ్ శ‌ర్మ (Siddharth Sharma) మ‌ర‌ణ వార్తను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాల‌యం వెల్లడించింది. భ‌వ‌హోర్ సాహెబ్ శ్మశాన వాటిక‌లో శుక్రవారం సిద్ధార్థ్ అంత్యక్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

యంగ్ పేస‌ర్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల హిమాచ‌ల్ ప్రదేశ్ క్రికెట్ ఆసోసియేష‌న్ సెక్రట‌రీ సుమిత్ శ‌ర్మ, జిల్లా క్రికెట్ స‌భ్యులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే.. అత‌ని మృతికి కార‌ణం ఏంట‌నేది మాత్రం వెల్లడించ‌లేదు. సిద్ధార్థ్ 2021-22 రంజీ ట్రోఫీ ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ హిమాచ‌ల్ ప్రదేశ్ జ‌ట్టులో స‌భ్యుడు. గుజ‌రాత్‌లోని ఉనాలో సిద్ధార్థ్ శ‌ర్మ జ‌న్మించాడు. ఫాస్ట్ బౌల‌ర్‌గా హిమాచల్ ప్రదేశ్ త‌ర‌ఫున దేశ‌వాళీ ట్రోఫీలో 2017-18 సీజ‌న్‌లో ఆరంగ్రేటం చేశాడు. ఆ సీజ‌న్‌లో 25 వికెట్లు తీశాడు.