Best XI of T20 World Cup 2021: భారత్‌లో బెస్ట్ క్రికెట్ ఆటగాడు లేడా, టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ టీంలో ఇండియా ప్లేయర్లకు దక్కని చోటు, బాబర్‌ అజాం కెప్టెన్‌గా 11 మందిని ఎంపిక చేసిన సెలక్షన్ ప్యానెల్‌

ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (Best XI of T20 World Cup 2021) ప్రకటించింది.

Babar Azam (Photo credit: Twitter)

టీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (Best XI of T20 World Cup 2021) ప్రకటించింది. ఈ జట్టులో ఆరు దేశాల జట్లకు చెందిన ఆటగాళ్లకు స్ధానం దక్కింది. టీమిండియా నుంచి ఒక్క ఆటగాడికి కూడా ( None from India in team) ఈ జట్టులో చోటు దక్కలేదు. ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియా, రన్నరప్‌ న్యూజిలాండ్‌, సెమీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, అధేవిదంగా శ్రీలంక,దక్షిణాఫ్రికా చెందిన ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జట్టుకు బాబర్‌ అజాంను (Babar Azam) కెప్టెన్‌గా సెలక్షన్ ప్యానెల్‌ ఎంపిక చేసింది .

ఆసీస్‌ స్టార్ డేవిడ్‌ వార్నర్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌కు ఓపెనర్లుగా ఈ టీంలో చోటు దక్కింది. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాంకు మూడో స్ధానంలో, శ్రీలంక ఆటగాడు చరిత్‌ అసలంకకు నాలుగో స్ధానంలో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్‌.. ఐదో స్ధానంలో చోటు దక్కించకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో ఇంగ్లండ్‌ ఆటగాడు మోయిన్‌ ఆలీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌ హసరంగాకు స్ధానం దక్కింది. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఆస్ట్రేలియా బౌలర్‌ ఆడం జంపాను ఎంపిక చేశారు.

షూలో బీర్ పోసుకుని తాగిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, వీడియో వైరల్, దీని వెనుక పెద్ద కథే ఉంది మరి, అదేంటో ఓ సారి చూద్దామా

ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్‌ బౌల్ట్,అన్రిచ్ నోర్ట్జే చోటు దక్కింది. ఇక 12వ ప్లేయర్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని తీసుకుంది. కాగా ఈ జట్టును బిషప్ (కన్వీనర్), నటాలీ జర్మనోస్, షేన్ వాట్సన్, లారెన్స్ లతో కూడిన సెలక్షన్ ప్యానెల్‌ ఎంపిక చేసింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా), జోస్‌ బట్లర్‌(ఇంగ్లండ్‌, వికెట్‌ కీపర్‌), బాబర్‌ అజాం(పాకిస్తాన్‌, కెప్టెన్‌), చరిత అసలంక(శ్రీలంక),మారక్రమ్‌(దక్షిణాఫ్రికా),మోయిన్‌ అలీ(ఇంగ్లండ్‌), హసరంగా(శ్రీలంక),ఆడం జంపా,(ఆస్ట్రేలియా),జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా),ట్రెంట్‌ బౌల్ట్(న్యూజిలాండ్‌) అన్రిచ్ నోర్ట్జే( దక్షిణాఫ్రికా)