Australian Cricketers drink from shoe (Photo-Video grab)

టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి అందుకొన్న ఆస్ట్రేలియా టీం సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాల్లో భాగంగా తమ బూట్లను విడిచి వాటిల్లో డ్రింక్స్‌ పోసుకోని (Australian Cricketers drink from shoe) తాగారు. తద్వారా ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్‌ అభిమానులకు పరిచయం చేశారు. దీన్నే వారు షూయి అని పిలుస్తారు. ఈ రకంగా బూట్లలో బీర్‌ను పోసుకొని తాగి సెలబ్రేట్‌ చేసుకొనే ఆచారం 18వ శతాబ్ధంలో జర్మనీలో మొదలైందని చెబుతారు.

దీన్ని భారీగా అదృష్టం కలిసి వచ్చినప్పుడు, సంబరాలకు చిహ్నం, లేదా శిక్షగా భావించేవారు. ఈ ఆచారం ఆస్ట్రేలియాలో బాగా పాపులర్‌ అయింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియన్‌ రైడర్‌ జాక్‌ మిల్లర్‌, ఫార్ములా వన్‌ డ్రైవర్‌ డేనియల్‌ రెకిర్డోలు 'షూయి'లను పోడియం మీదే చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తరచూ చాలా మంది క్రీడాకారులు దీనిని కొనసాగిస్తున్నారు. అయితే బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవులకు బూట్లు ఆవాసాలు. అటువంటి బూట్లలో ఆల్కహాల్‌ను పోసుకొని తాగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

విశ్వవిజేతగా ఆస్ట్రేలియా, ఫైనల్‌లో కివీస్ చిత్తు, బ్రేకుల్లేని బుల్‌డోజర్‌లా రెచ్చిపోయిన వార్నర్, మార్ష్..

ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ పత్రిక దీనిపై కథనాన్ని కూడా ప్రచురించింది. వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ దీనిపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారని కథనంలో తెలిపింది. సాధారణంగా చాలా బూట్లలో హాని రహిత బ్యాక్టీరియా ఉంటుందని తేలింది.

Here's Video 

వీటిల్లో ఆల్కహాల్‌ పోసి 60 క్షణాలు ఉంచి తిరిగి పరీక్షించారు. దీనిలో స్టాఫలోకాకస్‌ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఇంకా ఉన్నట్లు గుర్తించారు. ఇది కడుపులోకి వెళ్తే సెప్టిసిమియా, నిమోనియా, వాంతులు, ఆహారం విషపూరితం కావడం వంటి దుష్ప్రాభావాలను గుర్తించారు. దీనికి క్రీడాకారుడు వాటిల్లో డ్రింక్స్ పోసుకొని వెంటనే తాగడంతో ఆ బ్యాక్టీరియా సజీవంగా కడుపులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.