T20 World Cup 2021: టి20 ప్రపంచ కప్ సాధించేది ఇండియానే, అభిమాని ప్రశ్నకు అదిరిపోయే రిప్లయి ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్, అక్టోబర్ 31 న న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత్
ఈ పది రోజుల్లోమొత్తం 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు నాలుగు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వాటిలో పపువా న్యూ గినియా, ఒమన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ ఉన్నాయి.
టి20 ప్రపంచకప్ 2021 వేట మొదలై అప్పుడే 10 రోజులు దాటిపోయింది. ఈ పది రోజుల్లోమొత్తం 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు నాలుగు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వాటిలో పపువా న్యూ గినియా, ఒమన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ ఉన్నాయి. ఇక సూపర్ 12 దశలో పాకిస్తాన్ రెండు విజయాలతో దూకుడు మీద ఉంది. ఇండియా, న్యూజీలాండ్ లతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు అందుకున్న పాక్ సెమీస్ రేసుకు మరింత దగ్గరైంది.
ఇక ఇంగ్లండ్ కూడా బంగ్లాదేశ్‌ని చిత్తు చేసి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇక దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గనిస్తాన్ తలా ఒక విజయం సాధించి సెమీస్ లోకి దూసుకువెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నాయి. టీమిండియా, న్యూజిలాండ్‌లు ఇప్పటివరకు విజయాల ఖాతానే తెరవలేదు.. ఇక వెస్టిండీస్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. ఇక ఎవరు కప్ (T20 World Cup 2021) గెలుస్తారనే దానిపై ఎవరికి వారు తమ అంచనాల్లో మునిగితేలుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఐసీసీ టి20 ప్రపంచకప్ 2021ను ఎవరు (who will Winner Of The Tournament) గెలుస్తారంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు (Virender Sehwag gives stunning reply) అదిరిపోయే సమాధానమిచ్చాడు. 'నా దృష్టిలో ఇప్పటికీ టీమిండియానే ఫెవరెట్. ఈసారి కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తుంది. పాకిస్తాన్‌తో ఓడిపోయినంత మాత్రానా ( India lost Match Against Pakistan) టీమిండియాకు ఒరిగేదేం లేదు. ఇక్కడి నుంచే టీమిండియా తన ఆటతీరును రుచి చూపిస్తుంది. ఆటను గెలిచినప్పటి కంటే ఓడినప్పుడు ఎక్కువ మద్దతు ఇస్తే అది జట్టుకు బూస్టప్ అవుతుంది.
ఇప్పుడు టీమిండియా విషయంలో అదే జరుగుతుంది. కాబట్టి టి20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుస్తుందని బలంగా నమ్ముతున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 31(ఆదివారం) న్యూజిలాండ్‌తో ఆడనుంది. కాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.