ICC World Cup 2023: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ, వేదికలు మార్చే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసిన బీసీసీఐ, ఆ మైదానాల్లోనే ఆడాలని తెలిపిన ఐసీసీ

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.

Pakistan Cricket Team (photo credits: @mufaddal_vohra/Twtter)

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.

ముసాయిదా షెడ్యూల్‌ను చూసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వేదికలను మార్చాలని ఐసీసీ, బీసీసీఐలను కోరగా.. ఇందుకు అనుమతించలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను మార్చాలని పీసీబీ డిమాండ్‌ చేసింది.

ఈ సారి విరాట్ కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్టోబరు 20న బెంగళూరులోని చిన్నస్వామిలో ఆస్ట్రేలియాతోనూ, 23న చెన్నైలోని చెపాక్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తోనూ పాకిస్థాన్ తలపాడాల్సి ఉంది. చెన్నైలో పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భయపడుతోంది. చెపాక్‌ స్టేడియంలో రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌ వంటి స్పిన్‌ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ధోనీ 2011 సీన్ రిపీట్ చేస్తాం, సొంత గ‌డ్డ‌పై ఆడటమే మా బలం, ప్రపంచకప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

అదే సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలగా ఉంటుంది.దాంతో ఆస్ట్రేలియా వంటి జట్టుతో పోటీపడాల్సి రావడంతో భయం పట్టుకున్నది. అందుకే రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలని డిమాండ్‌ చేస్తున్నది. వేదికలను మారిస్తే పాక్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.

ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది ఆ జట్టేనా, టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇదే..

రెండు మ్యాచ్‌లను ముందుగా నిర్ణయించిన వేదికల్లోనే ఆడాలని స్పష్టం చేశాయి. వరల్డ్‌ కప్‌లో పాక్‌ అక్టోబర్‌ 6న క్వాలిఫయర్‌-1 జట్టుతో టోర్నీని ప్రారంభించనున్నది. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు, అహ్మదాబాద్‌లో ఒకటి, బెంగళూరులో రెండు, చెన్నైలో రెండు, కోల్‌కతాలో రెండు మ్యాచ్‌లు పాక్‌ ఆడాల్సి ఉంటుంది.