క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ అయింది. వరల్డ్ కప్ టోర్నీపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈసారి వరల్డ్ కప్ మామూలుగా ఉండదని, తగ్గపోరు ఖాయమని అన్నాడు. ‘సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడడం కచ్చితం గొప్ప అనుభవం. భారత జట్టు 12 ఏళ్ల క్రితం ఇక్కడే విశ్వ విజేతగా అవతరించింది.
దాంతో, ఈసారి మాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీమిండియాను మైదానంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈసారి వరల్డ్ కప్ మామూలుగా ఉండదు. ప్రతి మ్యాచ్‌లో తగ్గ పోరు ఖాయం. ఎందుకంటే..? గతంలో కంటే ఇప్పుడు ఆట మారిపోయింది. ప్రతి జట్టు సానుకూల దృక్ఫథంతో బరిలోకి దిగనుంది. దాంతో, ఈ ఏడాది అభిమానులు చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ చూస్తారు’ అని రోహిత్ తెలిపాడు.
2011ను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి వరల్డ్ కప్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.అక్టోబర్-నవంబర్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. బెస్ట్ ఇవ్వాలి. అప్పుడే వరల్డ్ కప్ నెరవేరుతుంది. ముంబైలో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ బృందం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. అక్కడ రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడనుంది.
వరల్డ్ కప్ లో భాగంగా దాయాది పాకిస్థాన్ తో అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా తలపడనుంది. 1992 నుంచి 2019 వరకు మొత్తం ఏడుసార్లు ఇండియా, పాకిస్థాన్‌లు వన్డే వరల్డ్‌కప్‌లో తలపడ్డాయి.అన్ని సందర్భాల్లోనూ టీమిండియానే విజేతగా నిలవడం విశేషం. టీమిండియా అత్యధికంగా 9 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్ ఈసారి ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత జట్టు ఐసీసీ ట్రోఫీ సాధించి నేటికి 10 ఏళ్లు. 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.