ICC World Cup 2023: ఈ సారి విరాట్ కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)..ఈసారి భారత జట్టు విరాట్ కోహ్లీ కోసం(Virat Kohli) వరల్డ్ కప్ సాధించాలని అన్నాడు.
ఈ ఏడాది భారత్‌లో జరగనున్నవన్డే వరల్డ్ కప్(ODI WC 2023) సమరానికి తేదీలు ఖరారయి నేపథ్యంలో ఆటగాళ్ల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.షెడ్యూల్ వచ్చిన సందర్భంగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)..ఈసారి భారత జట్టు విరాట్ కోహ్లీ కోసం(Virat Kohli) వరల్డ్ కప్ సాధించాలని అన్నాడు.
మేము 2011 వరల్డ్ కప్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కోసం ఆడాం. ట్రోఫీ గెలిచి కానుకగా అందించాం. అప్పుడు సచిన్ ఎలాగో.. ఇప్పుడు కోహ్లీ అలాగా. అందుకని ఈసారి భారత జట్టు విరాట్ కోహ్లీ కోసం ఆడాలి. ప్రతిఒక్కరూ అతడికి బహుమతిగా వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని సెహ్వాగ్ తెలిపాడు.
సొంతగడ్డపై 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గౌతం గంభీర్(98) వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ(92 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ చేశాడు. ధోనీ సిక్స్ కొట్టడంతో భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత 2013లో ధోనీ సారథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది.
అప్పటినుంచి ఇప్పటివరకూ ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. దాంతో, ఈసారి 2011 ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ ఏడాది వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ ఫైట్ ఉంది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది.