IND vs NZ T20 World Cup 2021: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఇండియా, సెమీస్‌ అవకాశాలు క్లిష్టం, 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమితో కోహ్లీ సేన సెమీస్‌ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. గ్రూప్‌-2లో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది.

Team India (Photo Credits: Twitter)

చావోరేవో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చేతులేత్తేయడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమితో కోహ్లీ సేన సెమీస్‌ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. గ్రూప్‌-2లో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 110/7 పరుగులకే పరిమితమైంది.

జడేజా (26 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (23) మాత్రమే రెండు పదుల స్కోరు దాటారు. ట్రెంట్‌ బౌల్ట్‌ (3/20) మూడు వికెట్లు పడగొట్టగా.. ఇష్‌ సోధీ (2/17) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. శాంట్నర్‌ (4-0-15-0) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 14.3 ఓవర్లలో 111/2 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. డారెల్‌ మిచెల్‌ (35 బంతుల్లో 49), విలియమ్సన్‌ (33 నాటౌట్‌) సత్తాచాటారు. బుమ్రా (2/19) రెండు వికెట్లు పడగొట్టాడు.

అదరగొట్టిన అఫ్ఘానిస్థాన్‌, నమీబియాపై 62 పరుగుల తేడాతో ఘన విజయం, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నవీన్‌వుల్‌ హక్‌

భారత బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీసిన ‘బర్త్‌ డే బాయ్‌’ ఇష్‌ సోధి (2/17) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. తర్వాత న్యూజిలాండ్‌ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు.