ఆదివారంనాటి గ్రూప్‌-2 మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ 62 పరుగుల తేడాతో నమీబియాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 160/5 స్కోరు చేసింది. ఓపెనర్లు మహ్మద్‌ షహజాద్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), హజ్రతుల్లా జజాయ్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మెరిశారు. కెప్టెన్‌ మహ్మద్‌ నబీ (17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్‌), అస్ఘర్‌ అఫ్ఘాన్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31) ఆఖర్లో విరుచుకుపడ్డారు. లాఫ్టీ ఈటన్‌ (2/21) ట్రంపెల్‌మన్‌ (2/34) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం నమీబియా 20 ఓవర్లలో 98/9 స్కోరుకే పరిమితమైంది. డేవిడ్‌ వీజ్‌ (26) టాప్‌ స్కోరర్‌. ఈటన్‌ (14)దే ఆ తర్వాత అత్యధిక స్కోరు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నవీన్‌వుల్‌ హక్‌ (3/26), హమీద్‌ హసన్‌ (3/9) చెరో మూడు వికెట్లు తీశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)