IND vs NZ 1st T20I: న్యూజీలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, విఫలమైన భారత బ్యాటర్లు, ఆఖర్లో మెరుపులు మెరిపించిన న్యూజీలాండ్ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

India lose a T20I (Photo-Twitter)

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.సూర్యకుమార్‌ యాదవ్‌ 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్‌ సుందర్‌ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో టీమిండియా ఓటమి దిశగా పయనించింది. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌ సాంట్నర్‌ , మైకెల్‌ బ్రాస్‌వెల్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. జాకబ్‌ డఫీ, లోకీ ఫెర్గూసన్‌, ఇష్‌ సోదీలు తలా ఒక వికెట్‌ తీశారు.

ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌(30 బంతుల్లో 59,3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించగా.. కాన్వే(52 పరుగులు) రాణించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శివమ్‌ మావిలు తలా ఒక వికెట్‌ తీశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement