ICC Women's U19 T20 World Cup 2023: ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది.
ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు.
Here's BCCI Tweet
ICC U19 WOMEN'S WC. India Women U19 Won by 8 Wicket(s) https://t.co/qWR75zhcrp #INDvNZ #U19T20WorldCup
— BCCI Women (@BCCIWomen) January 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 27, 2023 04:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

