India vs Zimbabwe: దుమ్మురేపిన టీమిండియా, జింబాబ్వేతో మ్యాచ్‌లో ఘన విజయం, సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు సై అంటున్న భారత్‌, బౌలర్ల ధాటికి కుప్పకూలిన జింబాబ్వే

మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 51 పరుగులు తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.

Credit@ BCCI twitter

Melbourne, NOV 06: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌ -12లో ( T20 World Cup) ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేను (Zimbabwe) చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్‌తో సెమీస్‌ పోరుకు సై అంటోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్‌ సేన 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో రియాన్‌ బర్ల్‌ (35), సికిందర్‌ రజా (34) మాత్రమే పోరాడారు. టీమ్‌ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, షమీ 2, హార్దిక్ పాండ్య 2 వికెట్లు పడగొట్టగా.. భువి, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు. భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (61; 25 బంతుల్లో), కేఎల్ రాహుల్‌ (51; 35 బంతుల్లో) అర్ధ శతకాలతో రాణించారు.

అంతకుముందు జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 51 పరుగులు తీశాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 (నాటౌట్- 4 సిక్సులు, 6 ఫోర్లు) , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో భారత్ కు 12 పరుగులు దక్కాయి. దీంతో 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2, బ్లెస్సింగ్ ముజారబానీ, సింకదర్ రజా చెరో వికెట్ తీశారు.