Ahmadabad Weather Forecast: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు వాన‌గండం ఉందా? ఇంత‌కీ అహ్మ‌దాబాద్ లో వాతావ‌ర‌ణంపై ఐఎండీ ఏం చెప్పిందంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (Ind vs Aus) మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Rohit Sharma and Pat Cummins (Credits: X)

Ahmadabad, NOV 18: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు (ODI Worldcup Final) సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (Ind vs Aus) మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, వాతావరణం సహకరిస్తుందా?లేదా అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చింది. వర్ష సూచనలేదని పేర్కొంది.

World Cup Trophy: వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ డిజైన్ ఎందుకు మార‌దు? అస‌లు విజేత‌ల‌కు ఇచ్చేది నిజ‌మైన ట్రోఫీ కాద‌ని మీకు తెలుసా? వ‌ర‌ల్డ్ క‌ప్ డిజైన్ వెనుక ఉన్న క‌థ ఇది!

వాతావరణం (weather forecast) ప్రశాంతంగా ఉంటుందని, దాదాపు 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే, 17 నుంచి 19 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది. 2003 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో (IND Vs AUS Final) అమీతుమీ తేల్చుకోనున్నాయి.