2023 Cricket World Cup (Photo-Wikimedia Commons)

New Delhi, NOV 18: నాలుగేండ్లకోసారి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్వహించే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ విజేతకు ట్రోఫీ (World Cup Trophy) బహుకరించే విషయం తెలిసిందే. దాదాపు 11 కిలోల బరువుతో, 60 సెంటీ మీటర్ల ఎత్తుతో ఉండే ఈ ట్రోఫీని బంగారం, వెండితో తయారు చేస్తారు. అయితే మరి ప్రతిసారి ప్రపంచకప్‌ విజేత కోసం ఈ హుంగూ ఆర్భాటాలతో ట్రోఫీని తయారు చేస్తారా..? అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ముమ్మాటికీ కాదు! ప్రస్తుతం ప్రపంచ విజేతకు అందిస్తున్న ట్రోఫీని 1999లో రూపొందించారు. ఇక అప్పటి నుంచి 2003, 07, 11, 15, 19 విజేతలకు ఈ ట్రోఫీని (World Cup Trophy) బహుకరించారు. బహుమతి ప్రదాన సమయంలో మాత్రమే ఒరిజినల్‌ ట్రోఫీని విజేత చేతికి అందిస్తారు. ఆ తర్వాత దాన్ని తిరిగి దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. దీని నమూనా ట్రోఫీని విజేతకు అందిస్తారు. వికెట్ల రూపంలో ఉన్న మూడు పిల్లర్ల మధ్య బంతిని పోలి ఉండే విశ్వం నమూనాతో ఉన్న ట్రోఫీనిక గత ఆరుసార్లుగా అందిస్తూ వస్తున్నారు.

World Cup Final: వ‌ర‌ల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్ లో కీల‌కం కానున్న సెంచ‌రీ, ఏ జ‌ట్టు నుంచి సెంచ‌రీ చేస్తే వాళ్త‌దే క‌ప్, ప్రారంభం నుంచి కొన‌సాగుతున్న సెంటిమెంట్ 

1975లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ (World Cup) నిర్వహించగా.. తొలి మూడు ఎడిషన్‌లలో ప్రూడెన్షియల్‌ కప్‌ ట్రోఫీ అని పిలిచేవారు. ఆ తర్వాత భారత్‌ భారత్‌లో జరిగిన 1987 ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వగా.. రియలన్స్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. దీంతో ప్రూడెన్షియల్‌ కప్‌ కాస్తా.. రిలయన్స్‌ ట్రోఫీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1992లో ‘బెన్సన్‌, హెడ్జెస్‌ ట్రోఫీ, 1996లో ‘విల్స్‌ కప్‌ ట్రోఫీ’గా దీన్ని పిలిచారు. 1999 నుంచి ఇక స్పాన్సర్ల పేర్ల మీద కాకుండా కేవలం ప్రపంచకప్‌ అని అభివర్ణిస్తున్నారు.