India vs England, 2nd T20I Highlights: రెండో టీ-20లో దుమ్మురేపిన టీమిండియా, ఇంగ్లండ్‌తో సిరీస్ స్వాధీనం, అరుదైన రికార్డు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ, మ్యాజిక్ చేసిన భువనేశ్వర్ కుమార్

మూడు టీ-20ల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్ కూడా గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్ భారత్ (India)వశమైంది. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం (India Won)సాధించింది.

Edgbaston, July 09:  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ-20లో టీమిండియాలో దుమ్మురేపింది. మూడు టీ-20ల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్ కూడా గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్ భారత్ (India)వశమైంది. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం (India Won)సాధించింది.  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. రోహిత్ (31)(Rohit), జడేజా (46 నాటౌట్)(Jadeja) ధాటిగా ఆడటంతో 170/8 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ను భువనేశ్వర్ కుమార్(Bhuvaneswar kumar) ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రమాదకరమైన జోస్ బట్లర్ (4), జేసన్ రాయ్ (0) ఇద్దరినీ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మొయీన్ అలీ (35), డేవిడ్ విల్లే (33 నాటౌట్) తప్ప మిగతా ఇంగ్లిష్ బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. డేవిడ్ మలాన్ (19), లియామ్ లివింగ్‌స్టన్ (15), హ్యారీ బ్రూక్ (8), శామ్ కర్రాన్ (2), క్రిస్ జోర్డాన్ (1) నిరాశ పరిచారు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.

ఈ క్రమంలోనే 17వ ఓవర్ చివరి బంతికి మ్యాట్ పార్కిన్సన్ (0)ను అవుట్ చేసిన హర్షల్ పటేల్(Harshal Patel).. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టు 121 పరుగులకే ఆలౌట్ అయింది. భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా(Hardik pandya), హర్షల్ పటేల్ చెరో వికెట్‌తో సత్తా చాటారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. అలాగే వరుసగా 14 టీ20 మ్యాచుల్లో గెలుపొందిన కెప్టెన్‌గా రోహిత్ మరో రికార్డు సృష్టించాడు.

IND vs ENG, 5th Test: భారత క్రికెట్ అభిమానులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ అభిమానులు, ట్విట్ట‌ర్‌లో ఫోటోలు, వీడియోలు వైర‌ల్, స్పందించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 

భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన కెరీర్ లో మరో రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో 300 ఫోర్లు కొట్టిన రెండో క్రికెటర్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో రెండో టీ20లో 2 ఫోర్లు కొట్టడంతో రోహిత్ ఈ రికార్డు సాధించాడు.కాగా, భారత్ నుంచి 300 ఫోర్లు బాదిన తొలి ప్లేయర్ రోహిత్ శర్మనే కావడం విశేషం.

IND vs ENG 2022: ముందు నోర్ముయ్, నువ్వు బ్యాటింగ్ చేయ్, నన్ను అంపైరింగ్‌ చేసుకోనివ్వు, ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌‌పై మండిపడిన అంపైర్ 

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ గా ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ టాప్ లో ఉన్నాడు. స్టిర్లింగ్ 325 ఫోర్లు బాదాడు. విరాట్ కోహ్లి 298 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సిక్సర్లలో గప్తిలో(165) టాప్ లో ఉండగా.. రోహిత్ (157) రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తో రెండో టీ20లో రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ, త్వరగానే ఔటయ్యాడు. 20 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 31 రన్స్ చేశాడు. షాట్ కోసం ప్రయత్నించి గ్లీసన్ బౌలింగ్ లో కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif