Edgbastonలో భారత్ - ఇంగ్లండ్‌ మధ్య జరిగిన అయిదోవ టెస్టు నాలుగ‌వ రోజున బ‌ర్మింగ్‌హామ్‌లో భార‌తీయ క్రికెట్ అభిమానులపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ జాత్యాంహ‌కార వ్యాఖ్య‌లు చేశారు. ఇండియ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. ట్విట్ట‌ర్‌లోనూ ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెంటనే స్పందించింది. తన అధికారిక ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అవుతూ ఈ అంశాన్ని ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు ఈసీబీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. టెస్టు మ్యాచ్ స‌మ‌యంలో జాత్యాంహ‌కార ఆరోప‌ణ‌లు జ‌రిగిన వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఈసీబీ వెల్ల‌డించింది. ఎడ్జ్‌బాస్ట‌న్‌లో ఉన్న అంద‌రితోనూ ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని ఈసీబీ తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)