Viral Video: బౌండరీ కొట్టి జట్టును గెలిపించిన అశ్విన్.. డ్రెస్సింగ్‌ రూములో రియాక్షన్ ఇలా.. వీడియో ఇదిగో!

బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ దెబ్బకు టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగిన వేళ క్రీజులో పాతుకుపోయిన రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

Credits: Video Grab

Newdelhi, Dec 26: బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన మీర్పూర్ టెస్టులో టీమిండియా (Team India) మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ దెబ్బకు టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగిన వేళ క్రీజులో పాతుకుపోయిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టును విజయ తీరాలకు చేర్చారు.

అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి

భారత్ ను వణికించిన మెహిదీ హసన్ బౌలింగులోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అశ్విన్ జట్టుకు అపూర్వ విజయాన్ని అందించిపెట్టాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ భారత్ వశమైంది. అశ్విన్, అయ్యర్ ఇద్దరూ కలిసి 8వ వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.  62 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో అశ్విన్ 42 పరుగులు చేయగా, అయ్యర్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. అశ్విన్ ఫోర్ కొట్టగానే డ్రెస్సింగ్ రూములో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

రెండో టెస్టులో భారత్ ఘనవిజయం, సిరీస్ టీమిండియా సొంతం, ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించిన శ్రెయాస్‌, అశ్విన్

అప్పటి వరకు డ్రెస్సింగ్ రూములో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒకరికొకరు హగ్ చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.