Credits: Twitter

Vijayawada, Dec 26: దక్షిణ కోస్తా, రాయలసీమల్లో (Rayalaseema) నేడు అక్కడక్కడ వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం పశ్చిమ నైరుతి వైపుగా పయనించి నిన్న ఉత్తర శ్రీలంకలో (Srilanka) తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ నైరుతి తీరం దిశగా పయనించి నేటి ఉదయానికి కొమెరిన్ తీరం దిశగా వస్తుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. నేడు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

కొత్త సంవత్సరం ఎన్ని సూర్య , చంద్ర గ్రహణాలు ఉన్నాయో తెలుసుకోండి..

మరోవైపు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏజెన్సీ ప్రాంతాలను చలి భయపెడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. పాడేరు సమీపంలోని జి.మాడుగులలో నిన్న 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉత్తర భారతదేశం చలికి వణుకుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలను పొగమంచు కమ్మేస్తోంది. కశ్మీర్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీలో సగటు కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 5.3, 16.2 డిగ్రీలు ఉండగా, నిన్న కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీలు నమోదైంది. పలు ప్రాంతాల్లో నేడు కూడా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని, శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

నేపాల్ సంక్షోభంలో ట్విస్ట్, మూడోసారి ప్రధానిగా ప్రచండ, కానీ రెండున్నరేళ్లే పదవిలో కొనసాగనున్న ప్రచండ

కశ్మీర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు చలికి గడ్డకట్టుకుపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకుపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర భారతదేశంలో మరో రెండురోజులపాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని, దట్టమైన మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.