IPL Auction 2025 Live

IPL 2023: ప్లే ఆఫ్స్‌ రేసు ముందు ధోనీ సేనకు భారీ షాక్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కేసు ఫైల్, ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు

సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కేసు ఫైల్ అయింది. చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు.సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్‌ కోర్టులో మే17న ఫిటిషిన్‌ వేశారు.

CSK Beat KKR (PIC @ IPL Twitter)

ఐపీఎల్‌-2023లో సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కేసు ఫైల్ అయింది. చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు.సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్‌ కోర్టులో మే17న ఫిటిషిన్‌ వేశారు.

ఇప్పటివరకు సీఎస్‌కే తమ హోం గ్రౌండ్‌ చెపాక్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఏడు మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ బ్లాక్‌లో విక్రయించందని వార్తలు వినిపిస్తున్నాయి. రూ.1500, 2000 ధరలుగా వుండే లోయర్‌ స్టాండ్‌ టిక్కెట్లను 8,000 రూపాయలకు విక్రయించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అందులో సీఎస్‌కే మెనెజ్‌మెం‍ట్‌ పాత్ర కూడా ఉంది అని పలువరు అరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్ చక్రవర్తి అనే అడ్వకేట్‌ కేసు ఫైల్‌ చేశారు.

స్టేడియంలో ఎదురుగా మ్యాచ్ జరుగుతుండగానే అతను చేసిన పనికి షాకైన ఫ్యాన్స్, ట్విట్టర్‌లో వైరల్‌ వీడియోపై ఫన్నీ కామెంట్లు

ఏంఎ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు, బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరగతున్నాయి. ఇందుకు సంబంధించి నేను ఈ రోజు సివిల్‌ కోర్టులో కేసు వేశాను. చెన్నై సూపర్ కింగ్స్, బీసీసీఐ, టీఎన్‌సీఏలపై ఫిటిషిన్‌ దాఖలు చేశాను" అని అశోక్ చక్రవర్తి తన ఫేస్‌బుక్‌ పోస్టు చేశారు.

మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు

మే20న అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.