Spectator Watches IPL 2023: స్టేడియంలో ఎదురుగా మ్యాచ్ జరుగుతుండగానే అతను చేసిన పనికి షాకైన ఫ్యాన్స్, ట్విట్టర్‌లో వైరల్‌ వీడియోపై ఫన్నీ కామెంట్లు

క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న లక్నో, ముంబై మ్యాచ్ చూసేందుకు అతను వచ్చాడు. ఎదురుగానే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ అతను మాత్రం ఫోన్‌ లో మ్యాచ్ లైవ్ చూస్తున్నాడు. దీన్ని అతని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి ట్విట్లర్‌ లో పోస్టు చేశాడు. దాంతో వైరల్‌గా మారింది

Spectator Watches IPL 2023: స్టేడియంలో ఎదురుగా మ్యాచ్ జరుగుతుండగానే అతను చేసిన పనికి షాకైన ఫ్యాన్స్, ట్విట్టర్‌లో వైరల్‌ వీడియోపై ఫన్నీ కామెంట్లు
Spectator Watches IPL 2023 (PIC@ Screen garb from viral video)

Lucknow, May 18: ఐపీఎల్‌ (IPL) మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద డిమాండే ఉంది. వేలాది రూపాయలు కూడా పెట్టేందుకు ఫ్యాన్స్ వెనుకాడటం లేదు. అయితే టికెట్లు దొరకకపోతే ఇంట్లోనే టీవీలో మ్యాచ్ చూస్తాం, లేదా ఫోన్‌ లో చూస్తాం. కానీ వేల రూపాయలు పెట్టి టికెట్ కొని స్టేడియం కు వెళ్లి మ్యాచ్ (IPL 2023) చూడకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. సరిగ్గా అదే తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియన్స్ తలపడిన ఐపీఎల్ మ్యాచ్‌ లో ఓ వ్యక్తి ఫోన్‌ లో క్రికెట్ చూస్తూ కనబడ్డాడు. లక్నోలోని భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి ఎక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న లక్నో, ముంబై మ్యాచ్ చూసేందుకు అతను వచ్చాడు. ఎదురుగానే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ అతను మాత్రం ఫోన్‌ లో మ్యాచ్ లైవ్ చూస్తున్నాడు. దీన్ని అతని వెనుక ఉన్న వ్యక్తి వీడియో తీసి ట్విట్లర్‌ లో పోస్టు చేశాడు. దాంతో వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా (Hilarious Reactions) స్పందిస్తున్నారు. తొలిరాత్రి రోజు పోర్న్ వీడియో చూస్తున్నట్లు ఉంది అంటూ ఒకతను కామెంట్ చేయగా, అతనికి బంగారు గిన్న ఇస్తే దాంట్లోనే అడుక్కునే తీరుగా ఉన్నాడు అంటూ మరొకరు కామెంట్ చేశారు.

అయితే స్టేడియంలో దూరం నుంచి సరిగ్గా కనిపించకపోవడం వల్ల అతను ఫోన్‌లో క్లోజప్ షాట్స్ చూస్తున్నాడని మరికొందరు అతన్ని సమర్ధించారు.

 

 

ఇలా ఈ వీడియోపై సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్లు అన్నీ ఇన్నీ కావు.

(The above story first appeared on LatestLY on May 18, 2023 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).