IPL 2023: పీకలోతు కష్టాల్లో జట్టు ఉన్నా చెత్త బ్యాటింగ్ ఆడి వెళుతున్నాడు, ఇంకా జట్టులో చోటు అవసరమా, దీపక్ హుడా ఆటతీరుపై మండిపడుతున్న లక్నో అభిమానులు

లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

Deepak Hooda (photo-BCCI)

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. లక్నో కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో దీపక్‌ హుడా క్రీజులోకి వచ్చి పూర్తిగా నిరాశ పరిచాడు.

లక్నోపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ, ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకున్న బెంగళూరు, తొలిరౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీసేన

ఇంత చెత్త ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇంకా జట్టులో చోటు అవరసరమా అంటూ లక్నో మేనేజ్ మెంట్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంత మంది హుడా తప్ప ఇంకా ఎవరూ జట్టులో లేరా అంటూ కామెం‍ట్లు చేస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో మాత్రం హుడా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. 17, 2, 7, 9, 2, 2, 2, 11, 1 ఇవి అతడు తన ఆఖరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు.