IPL 2023: ఆ బౌలర్‌ని ముంబై అప్పుడు వద్దని విడిచిపెట్టింది, ఇప్పుడు మళ్లీ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది, గాయపడిన జో రిచర్డ్‌సన్‌ స్థానంలో ఆసీస్‌ పేసర్‌ రిలే మెరెడిత్‌ రీ ఎంట్రీ

కనీస ధర రూ.1.5 కోట్లకు మెరెడిత్‌తో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Mumbai Indians players walking out to the field (Photo credit: Twitter)

ఐపీఎల్‌-2023లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జో రిచర్డ్‌సన్‌ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న రిచర్డ్‌సన్‌ .. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఈ మెగాటోర్నీ నుంచి తప్పుకున్నాడు.అయితే రిచర్డ్‌సన్‌ స్థానంలో మరో ఆసీస్‌ పేసర్‌ రిలే మెరెడిత్‌ను ముంబై భర్తీ చేసింది. కనీస ధర రూ.1.5 కోట్లకు మెరెడిత్‌తో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

వీడియో ఇదిగో, స్పిన్లర్ల చేతిలో కోహ్లీ, డుప్లెసిస్‌,మ్యాక్స్‌వెల్‌‌తో సహా నలుగురు క్లీన్ బౌల్డ్, బెంగుళూరును కకావికలం చేసిన కోలకతా స్పిన్నర్లు

ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెరెడిత్‌.. 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్ల హాల్‌ కూడా ఉంది. ఇక అతడికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్‌ 2021లో ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు మెరెడిత్‌ 12 వికెట్లు పడగొట్టాడు. గత రెండు సీజన్‌ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన అతడిని.. ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. తాజాగా మళ్లీ అతడినే ముంబై ఇండియన్స్ కనీస ధరకు తీసుకుంది. ఇక ముంబై ఇండియన్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌8న సీఎస్‌కేతో తలపడనుంది.