ఐపీఎల్-2023లో భాగంగా చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) బెంగుళూరును కకావికలం చేశారు. స్పిన్లర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు.
ఈడెన్ గార్డెన్స్‌లో తొడగొట్టి గెలిచిన కేకేఆర్, 81 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం
కోలకతా స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్‌లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా దాదాపు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Here's Video
ICYMI - TWO outstanding deliveries. Two massive wickets.
Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on.
Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW
— IndianPremierLeague (@IPL) April 6, 2023
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.