IPL 2023: తిన్నగా ఆడటం కూడా రాదు, చెత్త షాట్ ప్రయోగాలు మాత్రం చేస్తావు, కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్ పై మండిపడుతున్న కెకెఆర్ అభిమానులు
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అనవసర స్కూప్ షాట్ ఆడి క్లీన్ బౌల్డయ్యాడు.
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్ తన చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అనవసర స్కూప్ షాట్ ఆడి క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఢిల్లీపై చేసిన 12 పరుగులకే అత్యధికంగా ఉన్నాయి.
పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్‌దీప్.. అనంతరం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు.దీంతో కేకేఆర్ మేనెజ్‌మెంట్ అతడిని పక్కన పెట్టింది. అయితే మన్‌దీప్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ క్రమంలోనే ఢిల్లీతో మ్యాచ్‌కు అతడికి మరో అవకాశం కేకేఆర్ ఇచ్చింది.
కానీ కేకేఆర్ మేనెజ్‌మెంట్ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. ఇక కీలక సమయంలో వచ్చి చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న మన్‌దీప్ సింగ్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముందు తిన్నగా ఆడటం నేర్చుకో.. తర్వాత ప్రయోగాలు చేద్దువు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.