IPL 2023:ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న జట్లు ఇవే, మిగతా అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే ఆ జట్లకు ఛాన్స్, ఆ రెండు జట్లకు అద్భుతం జరిగితే తప్ప..

ఇప్పటికే పదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జట్లు ప్లే ఆఫ్‌ రేసులో నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంకా జట్లకు మూడు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో రేసులో ముందంజలో ఉన్న జట్లు ఏవో ఓ సారి చూద్దామా..

Gujarat Titans(Credit- ANI)

ఐపీఎల్‌-2023 సమరం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జట్లు ప్లే ఆఫ్‌ రేసులో నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంకా జట్లకు మూడు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో రేసులో ముందంజలో ఉన్న జట్లు ఏవో ఓ సారి చూద్దామా..

గుజరాత్‌ టైటాన్స్‌: డిపెండింగ్‌ చాంపియన్‌ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో గెలుపొంది 16 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది.ప్లే ఆఫ్స్‌ చేరాలంటే 18 పాయింట్లు అవసరమైన నేపథ్యంలో మిగిలి ఉన్న మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలుపొందినా గుజరాత్‌ నేరుగా ప్లే ఆఫ్స్‌ చేరుకునే ఛాన్స్‌ ఉంటుంది.

మిగిలిన మ్యాచ్‌లు:

మే 12: ముంబై ఇండియన్స్‌

మే 15: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మే 21: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: సీఎస్‌కే ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లకు ఆడగా అందులో 6 గెలిచింది. తద్వారా 12 పాయింట్లు సాధించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన నేపథ్యంలో మరో పాయింట్‌ ఖాతాలో వేసుకుని మొత్తంగా 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. రానున్న మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచినా 17 పాయింట్లతో ప్లే అఫ్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంటుంది.

మిగిలిన మ్యాచ్‌లు:

మే 10: ఢిల్లీ క్యాపిటల్స్‌

మే 14: కోల్‌కతా నైట్‌రైడర్స్‌

మే 20: ఢిల్లీ క్యాపిటల్స్‌

కీలక సమయంలో ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌, గాయంతో స్వదేశానికి వెళ్లిపోతున్న స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌తో స్థానం భర్తీ

లక్నో సూపర్‌ జెయింట్స్‌: లక్నో ప్రస్తుతం పదకొండింటికి ఐదు విజయాలతో 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్ అవకాశాలు నిలబెట్టుకుంటుంది.

మిగిలిన మ్యాచ్‌లు:

మే13: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మే 16: ముంబై ఇండియన్స్‌

మే 20: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

రాజస్తాన్‌ రాయల్స్‌: గతేడాది రన్నరప్ రాజస్తాన్‌ ఇప్పటి దాకా 11 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. సంజూ సేన ప్లే ఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

మిగిలిన మ్యాచ్‌లు:

మే 11: కేకేఆర్‌

మే 14: ఆర్సీబీ

మే 19: పంజాబ్‌ కింగ్స్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది కెకెఆర్. మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాలి.

మిగిలిన మ్యాచ్‌లు:

మే 11: రాజస్తాన్‌ రాయల్స్‌

మే 14: చెన్నై సూపర్‌ కింగ్స్‌

మే 20: లక్నో సూపర్‌ జెయింట్స్‌

ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై తాజా ప్రకటన, వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతాడని తెలిపిన సురేశ్‌ రైనా, ఐపీఎల్‌-2023 గెలుస్తామని ధీమా

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పది పాయింట్లతో ఉన్న ఆర్సీబీ.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకోగలదు.

మిగిలిన మ్యాచ్‌లు:

మే 9: ముంబై ఇండియన్స్‌

మే 14: రాజస్తాన్‌ రాయల్స్‌

మే 18: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మే 21: గుజరాత్‌ టైటాన్స్‌

పంజాబ్‌ కింగ్స్‌: కేకేఆర్‌ చేతిలో ఓటమితో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా 16 పాయింట్లు మాత్రమే వస్తాయి. భారీ తేడాతో గెలిస్తే ఆశలు ఉండే అవకాశం ఉంది.

మిలిగిన మ్యాచ్‌లు:

మే 13: ఢిల్లీ క్యాపిటల్స్‌

మే 17: ఢిల్లీ క్యాపిటల్స్‌

మే 19: రాజస్తాన్‌ రాయల్స్‌

ముంబై ఇండియన్స్‌: ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లలో 5 గెలిచిన ముంబై.. 10 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. ముంబై ఈసారి ప్లే ఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లలో గెలవడంతో పాటు భారీ రన్‌రేటు నమోదు చేయాల్సి ఉంటుంది.

మిలిగిన మ్యాచ్‌లు:

మే 9: ఆర్సీబీ

మే 12: గుజరాత్‌ టైటాన్స్‌

మే 16: లక్నో సూపర్‌ జెయింట్స్‌

మే 21: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లకు గానూ నాలుగింట గెలిచిన హైదరాబాద్‌ జట్టు అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోలేదు.

మిగిలిన మ్యాచ్‌లు:

మే 13: లక్నో సూపర్‌ జెయింట్స్‌

మే 15: గుజరాత్‌ టైటాన్స్‌

మే 18: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

మే 21: ముంబై ఇండియన్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. ఆడిన పది మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలవడం సహా ఇతర జట్ల ఫలితాలు తేలేవరకు వేచి చూడాల్సిందే.

మిలిగిన మ్యాచ్‌లు:

మే 10: చెన్నై సూపర్‌ కింగ్స్‌

మే 13: పంజాబ్‌ కింగ్స్‌

మే 17: పంజాబ్‌ కింగ్స్‌

మే 20: చెన్నై సూపర్‌ కింగ్స్‌