ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్ ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అర్చర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు.అర్చర్ స్థానాన్ని ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డన్‌తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది.
రూ.2 కోట్ల కనీస ధరకు జోర్డన్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దురదృష్టవశాత్తూ మిగిలిన మ్యాచ్‌లకు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి స్థానాన్ని క్రిస్ జోర్డాన్ భర్తీ చేయనున్నాడు" అని ముంబై ఇండియన్స్ ట్విటర్‌లో పేర్కొంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో జోఫ్రా అర్చర్ అంతగా అకట్టుకోలేకపోయాడు.
5 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 9.50 ఏకానమితో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక టీ20 స్పెషలిస్టు బౌలర్‌గా పేరుందిన క్రిస్ జోర్డన్ జట్టులో చేరడం ముంబైకు మరింత బలం చేకూరుస్తుంది. ఇంగ్లండ్ తరపున 87 టీ20లు ఆడిన జోర్డాన్ 96 వికెట్లు పడగొట్టాడు. ఇక మంగళవారం ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌కు జోర్డాన్ అందుబాటులో ఉండనున్నాడు.