IPL Auction 2025 Live

IPL 2023 Playoffs Race: ఆ నాలుగు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్, ప్లేఆఫ్ చేరే మిగతా మూడు జట్లు ఇవే, చివరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన జట్లు ఇవిగో..

ప్లే ఆఫ్స్‌లో నిలిచేందుకు ఆరు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినా కూడా ప్లే ఆఫ్స్ బెర్తులు మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు.

Mumbai Indians players walking out to the field (Photo credit: Twitter)

ఐపీఎల్ ప‌ద‌హారో సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో నిలిచేందుకు ఆరు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినా కూడా ప్లే ఆఫ్స్ బెర్తులు మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు. ప్రతి మ్యాచూ, పాయింటూ కీలకమవడంతో.. విజయాలపైనే కాదు జట్లు నెట్‌ రన్‌రేట్‌పై కూడా దృష్టి సారిస్తున్నాయి. దాదాపు అన్ని జట్లు ఇంకా ఒకటో రెండో మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది.

చివరి ఓవర్‌లో 2 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, సరికొత్త రికార్డు నెలకొల్పిన భువనేశ్వర్ కుమార్, అయినా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌

ఇక సోమవారం సన్‌రైజర్స్‌పై విజయంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్‌ 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌ చేరింది. మొత్తం పది జట్లు ఆడే ఐపీఎల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో తొలి రెండు స్థానాలు ప్రత్యేకం.

ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్ షాక్, చీలమండ గాయంతో స్టార్ స్పిన్నర్ నూర్‌ ఆహ్మద్‌ దూరం, టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం

ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్‌లో నిలిచే జట్లు టాప్‌ 2లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ప్ర‌స్తుతానికి తొమ్మిది మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్లేఆఫ్ రేసులో ఏ జట్లు ఉన్నాయో ఓ సారి చూద్దాం.

గుజరాత్‌ (Gujarat Titans) : ప్రస్తుతం 18 పాయింట్లు.. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు ఒకటి(బెంగళూరు). ప్లేఆఫ్స్‌లో చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ నిలిచింది. చివరి మ్యాచ్‌లోనూ ఆర్బీబీపై గెలిస్తే ముంబయి ఆడే మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్‌-1లోనే కొనసాగుతుంది.

చెన్నై (Chennai Super Kings) : ప్రస్తుతం 15 పాయింట్లు.. ఆడాల్సింది ఒక మ్యాచ్‌(ఢిల్లీ). ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆదివారం కోల్‌కతాపై ఓడిపోవడం చెన్నైపై ప్రభావం చూపింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్‌ 2 స్థానాల్లో నిలిచే అవకాశాలు 37 శాతానికి తగ్గాయి. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో వారి సొంతమైదానంలో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే ముంబయి, లక్నో, బెంగళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది.

ముంబయి(Mumbai Indians) : ప్రస్తుతం 14 పాయింట్లు.. ఆడాల్సిన మ్యాచ్‌లు రెండు(లక్నో, సన్‌రైజర్స్‌). ముంబయి ఇండియన్స్‌. తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 18 పాయింట్లతో క్వాలిఫయర్‌ 1లోనే ప్లేస్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. రెండూ ఓడిపోతే.. కింద ఉన్న ఇతర జట్లు ముంబయిని అధిగమిస్తాయి. ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. ఒక్కటి గెలిచినా.. ముంబయికి అవకాశం ఉంటుంది.

లక్నో(Lucknow Super Giants) : ప్రస్తుతం పాయింట్లు 13.. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు రెండు (ముంబయి, కోల్‌కతా). ఈ రెండింటిలో లక్నో ఓడిపోతే.. ప్లేఆఫ్స్‌ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. ఆర్‌ఆర్‌, కేకేఆర్‌లు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలుగుతాయి. ఒకవేళ చెన్నై, ముంబయి చివరి మ్యాచ్‌ల్లో ఓడి.. లక్నో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 17 పాయింట్లతో టాప్‌ 2లో నిలిచే అవకాశం ఉంటుంది.

బెంగళూరు(Royal Challengers Bangalore) : ప్రస్తుతం పాయింట్లు 12 .. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు రెండు (సన్‌రైజర్స్‌, గుజరాత్‌). ఆర్సీబీ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తుంది. ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే.. 14 పాయింట్లతో ఇతర జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది.

12 పాయింట్లతో ఉన్న పంజాబ్‌(Punjab Kings) తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు తనకు కలిసి రావాలి. ఇక పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్‌, ఢిల్లీ.. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగాయి. రాజస్థాన్‌, కోల్‌కతా ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఒక వేళ వీటిల్లో గెలిచినా.. ఇతర జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తాయే తప్ప.. ప్లేఆఫ్స్‌లో చేరడం దాదాపు కష్టమే.