Bhuvneshwar Kumar

టీమిండియాపేసర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌..ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో రెండో సారి ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మరో రన్‌ బైస్‌ రూపంలో వచ్చింది. ఈ ఓవర్‌లో భువీ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా ఓ రనౌట్‌ కూడా చేశాడు. ఓవరాల్‌గా ఆఖరి ఓవర్‌లో గుజరాత్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది.

ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్ షాక్, చీలమండ గాయంతో స్టార్ స్పిన్నర్ నూర్‌ ఆహ్మద్‌ దూరం, టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం

ఐదు వికెట్ల హాల్‌తో పాటు 25 ప్లస్‌ పరుగులు చేసిన రెండో బౌలర్‌గా భువనేశ్వర్‌ రికార్డులకెక్కాడు. ​ఈ ఘనత సాధించిన జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. గతంలో డెక్కన్‌ ఛార్జర్స్‌పై జడేజా 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు సాధించాడు.ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌ చేతిలో 34 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమిపాలైంది. దీంతో ప్లేఆఫ్‌ రేసు నుంచి సన్‌రైజర్స్‌ అధికారికంగా నిష్క్రమించింది.

Here's Video

టాస్‌ ఓడి ‍బ్యాటింగ్‌ దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువీతో పాటు నటరాజన్‌, ఫరూఖీ, జానెసన్‌ తలా వికెట్‌ సాధించారు.