Yashasvi Jaiswal Fastest 50: ఫస్ట్ టైం చూస్తున్నా.. ఇదేమి బ్యాటింగ్ బాబోయ్, యశస్వీ జైశ్వాల్‌‌ను ఆకాశానికి ఎత్తేసిన విరాట్ కోహ్లీ, 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన జైశ్వాల్

ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ 13 బంతుల్లోనే జైశ్వాల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్న సంగతి విదితమే.

Yashasvi Jaiswal

ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ 13 బంతుల్లోనే జైశ్వాల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్న సంగతి విదితమే. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ ఫీప్టి చేసిన ఆటగాడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

గెలుపు ఊపు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ షాక్, ఐపీఎల్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్‌కు భారీ జరిమానా

సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన జైశ్వాల్‌పై టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడుఏ. "వావ్‌.. ఇటీవల నేను చూసిన అత్యుత్తమ బ్యాటింగ్‌ ఇదే. వాట్‌ ఏ టాలెంట్‌ యశస్వి" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లి రాసుకొచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్‌ లీ కూడా జైశ్వాల్‌ను ప్రశించాడు. జైశ్వాల్‌ ఒక అద్భుతం.. అతడిని బీసీసీఐ జాతీయ జట్టులోకి తీసుకోవాలని బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు