IPL 2023 Final: సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్ జరుగకపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? రూల్స్ ప్రకారం ట్రోఫీ ఎవరికి దక్కుతుందంటే!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దాంతో, ఒకవేళ వరుణుడు శాంతించకుంటే పరిస్థితి ఏంటీ? ఇరుజట్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఏమాత్రం అవకాశం ఉన్నా మ్యాచ్ ఆడిస్తారు. అలా వీలుపడనప్పుడు ఏం చేస్తారంటే..?
Ahmadabad, May 28: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు (IPL Final) వర్షం అంతరాయం కలిగిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దాంతో, ఒకవేళ వరుణుడు శాంతించకుంటే పరిస్థితి ఏంటీ? ఇరుజట్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. ఏమాత్రం అవకాశం ఉన్నా మ్యాచ్ ఆడిస్తారు. అలా వీలుపడనప్పుడు ఏం చేస్తారంటే..? రాత్రి 9:35 గంటల వరకు వర్షం తగ్గితే ఓవర్లు కుదించరు. 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకుంటే కనీసం 5 ఓవర్లు లేదా సూపర్ ఓవర్ అయినా ఆడిస్తారు. ఒక్క బంతి కూడా పడేందుకు చాన్స్ లేకుంటే మాత్రం రిజర్వ్ డేన అంటే.. రేపు ఫైనల్ జరుగుతుంది.
రేపు కూడా వర్షం కురిసిందంటే మాత్రం పాయింట్లను చూస్తారు. 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను (Gujrat Titans) విజేతగా ప్రకటిస్తారు. దాంతో, రెండో స్థానంలో ఉన్న సీఎస్కే (CSK) రన్నరప్‌తో సరిపెట్టుకుంటుంది.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్. టాస్ సమయానికి స్టేడియంలో భారీ వర్షం మొదలైంది. దాంతో, మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు.